NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కారుణ్య నియామకాల కింద ఏపీఎస్ఆర్టీసీ లో 24 మందికి కండక్టర్ ఉద్యోగాలు

1 min read

నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: కారుణ్య నియామకాల కింద  ఏపీఎస్ఆర్టీసీ లో 24 మందికి కండక్టర్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన  అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు..ఇది మంచి అవకాశం అని, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని  కలెక్టర్ సూచించారు. ఉద్యోగాలు పొందిన వారంతా పదోన్నతులు పొంది  ఎదిగే అవకాశం ఉందని, ఇప్పటినుంచే అన్ని అంశాలను నేర్చుకుని, కెరీర్ ను డెవలప్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లా కలెక్టర్  ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపడం వల్ల తమకు ఉద్యోగ నియామకం జరిగిందని అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎమ్ శ్రీనివాసులు,  ఉమ్మడి జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ పిఓ రామకృష్ణ, అభ్యర్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *