ఎ పి హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
1 min read
ముఖ్యఅతిథిగా ఏలూరు జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
రాష్ట్రంలో హోటల్ యజమానులు సమస్యలపై కొన్ని జిల్లాల నుండి చర్చ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఆర్నా ఫంక్షన్ హాల్ నందు పశ్చిమగోదావరి జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరయ్యారు. ఈ సమావేశంలో హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో కొన్ని జిల్లాల నుండి చర్చించడం జరిగింది. రాత్రి వేళల్లో సమయపాలన,గ్యాస్ సిలిండర్ల కొరత, పబ్లిసిటీ బోర్డ్స్ పై పన్నుల భారం, నిత్యవసర సరుకులు ధరల నియంత్రణ స్థిరత్వం లేకపోవడం,ట్రాఫిక్ నిబంధనలు ఇలా పలు అంశాలపై హోటల్ యజమానులు పలు సమస్యలను ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ముందు ఉంచారు. రాష్ట్ర కార్యవర్గం అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులతో స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చి మాట్లాడి సమస్యలను సున్నితంగా పరిష్కరించుకుందామన్న న్నారు. కస్టమర్లకు చక్కటి సేవలను ప్రతి హోటల్ యజమాని సహకరించి తమ పరిధిలో మంచి సేవలను వినియోగదారులకు అందించాలన్నారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి మాగంటి బాబు, పలువురు కోటమి పలువురు కూటమి నాయకులు,ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, సెక్రటరీ కె.రమణ,ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వై.కొండయ్య నాయుడు , ట్రెజరీ లక్ష్మీనారాయణ మరియు పశ్చిమగోదావరి జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కాశి రాజు, సెక్రెటరీ బిర్లాభవన్ రాజా, ట్రెజరర్ రమణ భాస్కర్ మరియు పలువురు కమిటీ సభ్యులు, రాష్ట్ర నలుమూలల నుండి కార్యవర్గ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



