NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన ఎముకతో నూతన జీవితం

1 min read

మూర్ఛతో తరుచూ డిస్టోకేషన్, భుజం సమస్యకు శాశ్వత పరిష్కారం

బెంగుళూరు బోన్ బ్యాంక్ నుంచి విశాఖకు తరలించిన ఎముక

అలోగ్రాఫ్ట్ ద్వారా భుజం పునర్నిర్మాణం

రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానం అమలు – కిమ్స్

విశాఖపట్నం, న్యూస్​ నేడు : బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో ప్రాణాలు నిలబెట్టే ఘటనలు సాధారణమే. అయితే అదే విధంగా సేకరించిన ఎముకను ఉపయోగించి ఒక వ్యక్తికి నూతన జీవితం అందించడం విశాఖపట్నంలో జరిగింది. కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార వైద్యులు బెంగుళూరులోని బోన్ బ్యాంక్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఎముకను అలోగ్రాఫ్ట్ విధానంలో ఉపయోగించి అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శస్రచికిత్స చేసిన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి వెల్లడించారు.నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మూర్ఛ సమస్యతో బాధపడుతూ తరచూ పడిపోవడం వల్ల భుజం ఎముక తరచూ డిస్లోకేషన్ అవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ సమస్య మళ్లీ మళ్లీ రావడంతో కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధారకు వచ్చారు. ఇక్కడ చేసిన పరీక్షల్లో భుజంలోని రోటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు హ్యూమరల్ హెడ్‌లో పెద్ద లోపం ఉన్నట్లు గుర్తించాం. ఇందుకు సాధారణ ఆర్థ్రోస్కోపిక్ చికిత్స సరిపోదని నిర్ధాయానికి వచ్చాం. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ముందుగా మూర్ఛను నియంత్రణలోకి తెచ్చిన అనంతరం ఓపెన్ రోటేటర్ కఫ్ రిపేర్‌తో పాటు అలోగ్రాఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్స చేశాం. బెంగుళూరులోని బోన్ బ్యాంక్ నుంచి సేకరించిన ఎముకను మార్పిడి చేసి భుజ నిర్మాణాన్ని పునర్నిర్మించారు. అలోగ్రాఫ్ట్ అంటే వేరే వ్యక్తి శరీరం నుంచి సేకరించిన ఎముకను రోగి శరీరంలోకి మార్పిడి చేయాడాన్ని అలోగ్రాఫ్ట్ అంటారు.ఈ శస్త్రచికిత్స ద్వారా కండరాల గాయం మాత్రమే కాకుండా భుజం స్థిరత్వాన్ని కూడా పునరుద్ధరించగలిగామని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని తన రోజువారీ పనులు స్వయంగా చేసుకుంటున్నాడని డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి తెలిపారు. ఇలాంటి అలోగ్రాఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ విధానం రాష్ట్రంలో తొలిసారిగా విజయవంతంగా అమలు చేయడం విశేషమన్నారు ఆయన.

About Author