NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూర్ లో నక్షత్ర హాస్పిటల్ ప్రారంభం

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నూతనంగా నక్షత్ర ఆసుపత్రిని గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.పట్టణంలో శివశంకర్ థియేటర్ పక్కన నూతనంగా నక్షత్ర హాస్పిటల్ డాక్టర్ టి సుధాకర్ చిన్న పిల్లల వైద్యులు..గర్భవతులు డాక్టర్ కే నవీనా జ్యోతి ఆస్పత్రిలో ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే తపనతోనే ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించామని చిన్న పిల్లలకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా గర్భవతుల సమస్యలు ఇక్కడికి వచ్చినట్లయితే వారికి తగిన వైద్యం అందిస్తామని వారు అన్నారు.వారికోసం ప్రత్యేకంగా మిషన్లు పరికరాలను ఏర్పాటు చేశామని అన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్లు కోరారు.ముందుగా మాల మహానాడు తాలూకా అధ్యక్షులు శివప్రసాద్ మరియు చంద్రమోహన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author