మెరిసిన కలమందలపాడు ఆణిముత్యం
1 min read
మండల టాపర్ గా మషీరా 582
మిడుతూరులో 79 శాతం ‘పది’ఉత్తీర్ణత..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: గురువారం ఉదయం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కలమందలపాడు గ్రామంలో ఓ పేదింటిలో విద్యా కుసుమం వెల్లివిరిసింది.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో మారుమూల గ్రామమైన కలమందలపాడులో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న గ్రామానికి చెందిన దూదేకుల మషీరా 600 మార్కులకు గాను 582 మార్కులతో మండల టాపర్ గా గెలిచారు.మిడుతూరు మండలంలో 429 మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు(79.72 శాతం)ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ అన్నారు.కస్తూర్బా పాఠశాలలో 38 మందికి గాను 32 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. మోడల్ పాఠశాలలో 92 మంది విద్యార్థులకు గాను 84 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.మిడుతూరు జడ్పీహెచ్ఎస్ లో 69 కి గాను 37 మంది పాసయ్యారు. మిడుతూరు చెన్నకేశవ పాఠశాలలో 16 మంది విద్యార్థులకు గాను 16 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.చెన్నకేశవ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మహాలక్ష్మి-576,పి మంజశ్రీ- 576,పసుల హరిణి-571.. మోడల్ పాఠశాల విద్యార్థి వడ్డే మహేష్-555,కడుమూరు ఉర్దూ పాఠశాల విద్యార్థి లడ్డు అర్సియా-550 మార్కులతో విద్యార్థుల ప్రతిభ కనబరిచారని ఎంఈఓ తెలిపారు.అదేవిధంగామండల టాపర్ గా నిలిచిన మషీరా ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు విద్యార్థిని అభినందించారు. విద్యార్థి తండ్రి సైసావలి జిల్లా పరిషత్ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఉన్నారు.విద్యార్థినిని ఎంఈఓ మల్లికార్జున నాయక్,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మరియు సిబ్బంది అభినందించారు.

