గ్రామంలో తాగునీటి సమస్యపై స్పందించిన డోన్ ఎమ్మెల్యే
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని మాధవరం గ్రామంలో తాగునీటి సమస్యపై స్పందించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , కేవలం 10 గంటల్లో కొత్త మోటార్ ఏర్పాటు చేయించి సమస్యకు పరిష్కారం కల్పించారని గ్రామస్తులు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి హాజరైత్రాగునీరు మోటర్లకు పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేశారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కోట్ల కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.


