NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి మండలంలోనే టాపర్ గా నిలిచిన విద్యార్థినీ పి.రాగనిత్య

1 min read

డోన్ డివిజన్ స్థాయిలో మూడవ స్థానం దక్కించుకున్న ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభను కనబరిచిన ఏనుగు మర్రి పాఠశాల విద్యార్థులు

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మెరిసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు

 ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతిభను మా పాఠశాల విద్యార్థులు కనబరిచారని ఏనుగుమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు.ఎం. రాజశేఖర్ అన్నారు.ప్యాపిలి మండలంలోని  ఏనుగుమర్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో పి.రాగనిత్య 587 మార్కులతో ప్యాపిలి మండలంలోనే టాపర్ గా నిలిచింది. డోన్ డివిజన్ స్థాయిలో మూడవ స్థానం ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విలువైన ముద్రను కైవసం చేసుకుంది.అలాగే పాఠశాల స్థాయిలో ద్వితీయ స్థానం ఎం.మనీషా 576 మార్కులు, తృతీయ స్థానంలో ఎం.గీతాలహరి 567 మార్కులు, నాలుగోవ స్థానంలో పి. హర్షవర్ధన్558 మార్కులు సాధించి ప్యాపిలి మండలానికి, పాఠశాలకు, గ్రామానికి పేరు తెచ్చిన విద్యా కునలకు అభినందన కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. టాపర్ విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో ఇంత మంచి ఫలితాలు సాధించామంటే మా పాఠశాల ప్రత్యేకత మరియు మా ఉపాధ్యాయుల   క్రమశిక్షణ, వారు బోధించిన బోధన పట్లనే మాకు ఇంతమంచి మార్కులు తెచ్చుకున్నామని, అలాగే మా ఏనుగుమర్రి జిల్లా పరిషత్ పాఠశాలకు పేరు సంపాదించుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజనేయులు, మద్దిలేటి, సునీల్, ప్రతాప్ రెడ్డి, సాలయ్య, బి. మద్దిలేటి, మరియు ఇతర ఉపాధ్యాయులు,ఎస్ఎంసి చైర్మన్ మహేంద్ర, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author