NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ పోలీస్ అధికారి,ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు పదవీ విరమణ

1 min read

స్నేహానికి ప్రాధాన్యతతో పాటు మానవతా విలువలు కలిగిన నాయకులు దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

ప్రశంసించిన సీనియర్ పోలీస్ అధికారి ఎస్.పి నక్కా సూర్య చంద్రరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరులో జరిగిన రిటైర్డ్ ఎస్పి నక్క సూర్యచంద్రరావు పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పాలుగోన్నరు.సుదీర్ఘకాలం పాటు పోలీస్ అధికారిగా సేవలందించిన నక్క సూర్యచంద్రరావు విశేష అనుభవం, జ్ఞానం కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరింతగా ఉపయోగపడే విధంగా జరగాలని కోరుతున్నట్లు, వారి పదవి విరమణ జీవితం ఆనందంగా గడపాలని కాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.రిటైర్డ్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు దంపతులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు,పెద్ద ఎత్తున పాల్గొని నక్క సూర్యచంద్రరావుకు దంపతులకు శాలువాలు కప్పి,పూల బొకేలు అందించి పదవి వివరణ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author