రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు మంత్రి టీజీ భరత్ ప్రోత్సాహం
1 min read
సామాన్య కార్యకర్తలకు రాష్ట స్థాయికి ఎదగడంలో మంత్రి ప్రోత్సాహం ఎంతో ఉంది
మంత్రి కార్యాలయంలో ఘనంగా బూత్ ఇన్చార్జిల పుట్టినరోజు వేడుకలు
హాజరైన నాయకులు, కార్యకర్తలు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నియోజకవర్గంలో మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ అన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని 2వ వార్డు 197 బూత్ ఇన్చార్జి జీనత్, 23వ వార్డు 95 బూత్ ఇన్చార్జి సుజాత జన్మదిన వేడుకలు మంత్రి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కర్నూల్లోని మహిళలు ఉన్నత స్థాయిలో ఉండేందుకు మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. బూత్ ఇన్చార్జి స్థాయి నుండి వార్డు, నియోజకవర్గం, రాష్ట్ర స్థాయిలో అనేక పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించారని చెప్పారు. తమ కష్టాన్ని గుర్తించి ఇలా పుట్టినరోజు వేడుకలు కార్యాలయంలో చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలకు మంత్రి టీజీ భరత్ శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కుటుంబానికి మౌర్య ఇన్ హోటల్లో విందును మంత్రి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్, మాజీ కార్పొరేటర్లు గున్నామార్క్, రామాంజనేయులు, మైనారిటీ నాయకులు హమీద్, బూత్ ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

