పెదపాడు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరo
1 min read
స్వాతంత్ర సమరయోధుల ధైర్యసహసాలు,దేశభక్తి నేటికీ యువతకు ప్రేరణ కలిగిస్తున్నాయి
రిసోర్స్ పర్సన్ గోకా రాఘవ
కార్యక్రమన్ని గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు పరిరక్షణలో నిర్వహించారు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా సోమవారం రిసోర్స్ పర్సన్ గోక రాఘవ పాల్గొనిన విద్యార్థిని, విద్యార్థులకు చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) గురించి ఆయన జూలై 23 1906 న మధ్యప్రదేశ్ లోని భవ్రా గ్రామంలో సీతారాం తివారీ, జగరాణిదేవి దంపతులకు జన్మించారు.15 ఏళ్ల వయసులో 1921లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయినప్పుడు కోర్టులో తన పేరు ఆజాద్ (స్వేచ్ఛ జీవి)తండ్రి పేరు “స్వతంత్ర” చిరునామా “జైలు” అని చెప్పడంతో ఆయనకు ఆజాద్ పేరు స్థిరపడిపోయింది. గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేసిన తర్వాత, సాయుధ పోరాటమే మార్గమని భావించి విప్లవకారులతో చేతులు కలిపారు.1925లో కాకోరీ రైలు దోపిడీ మరియు 1928లో లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా సాండర్స్ హత్యలో కీలకపాత్ర పోషించారు.భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత ప్రముఖా విప్లవకారుడు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన వాడు,బ్రిటీష్ పోలీసులకు చిక్కకుండా సజీవంగా పట్టుబడును అని ప్రతిజ్ఞ చేసి ఫిబ్రవరి 27,1931 న 24 ఏళ్ల వయసులో అలహాబాద్(ప్రస్తుత ప్రయాగ్ రాజ్) ఆల్ఫ్రెడ్ పార్కులో పోలీసులతో జరిగిన ఎదురు కల్పుల్లో తన తుపాకీలో చివరి తూట వరకు పోరాడి తనను తాను కాల్చుకుని వీర మరణం పొందారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్. ఎస్.ఆర్.ఏ) నాయకుడిగా భగత్ సింగ్ తో కలసి పనిచేశారు.ఆయన ధైర్య సాహసాలు, దేశభక్తి నేటికీ యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని తెలియజేశారు. అనంతరం సింగంశెట్టి సంజీవరావు రచించిన బుర్రకొక బుద్ధి అనే పుస్తకం నుండి అయస్కాంతపు బొంగరం-మనిషి చదువు అనే కథలను విద్యార్థులచే చదివించడం,పుస్తక పఠనం చేయించడం జరిగినది.తర్వాత రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ విద్యార్థిని విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ చెస్ -లూడో పై అవగాహన కల్పించి, నేర్పించి,ఆడించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు. ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజేశారు.

