అర్జీదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి
1 min read
ఒక్కసారి వచ్చిన అర్జీ రెండవ సారి వస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాము
పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 273
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇంచార్చి ఆర్డీవో ఐ.కిషోరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటిలు ప్రజలు నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీదారులు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు పరిష్కారంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా పరిష్కారం ఉండాలని అన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాన్ని లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంటు ఇవ్వాలన్నారు.విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామానికి కు చెందిన కె.ఆర్.కోటేశ్వర రావు తన దరఖాస్తులో తనకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం లో 100 చదరపు గజాలు స్థలం కొనుగోలు చేసానని, రిజిస్టర్ ఆఫీస్ నుండి EC తీసుకుని ఎటువంటి అన్యాక్రాంతం జరిగి ఉండలేదని నిర్దారించుకుని క్రయం పొందానని, పి.ఏ.ఆర్.ఏ.ఎస్. కంపెనీ వారు మూడవ పార్టీ రిజిస్ట్రేషన్స్ విషయంపై విచారణ చేసి రద్దు చేయమని జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు వారికి లేఖ ద్వారా కోరగా, తనకు నోటీసు ఇచ్చారని, తనకు న్యాయం చేయాలనీ కోరారు, నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామనివాసి కొప్పర్తి ఒలేశ్వరిదేవి పెద్దింట్లమ్మ గుడి వద్దగల లే-అవుట్లో నా స్థలానికి చూపించు, స్వాధీనం చెయ్యాలని కోరారు, చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ నివాసి దుగ్గిరాల దీప్తి మా భూమి సర్వేలో లోపాలు ఉన్నాయని సరిచెయ్యాలని కోరారు, కుక్కునూరు మండలం పుల్లప్పగూడెం గ్రామానికి చెందిన కుంజ ముత్తయ్య మా పల్లెకు చెందిన రెండు ఎకరాలు స్మశాన వాటిక అక్రమనకు గురైందని, విచారణ చేసి తగు న్యాయం చెయ్యాలని కోరారు, చాట్రాయి మండలం ఆరుగల్లుపేట చెందిన సాధు బాబురావు ఇంటి విద్యుత్తు కోసం డిడి తీసి విద్యుత్తు శాఖ చుట్టూ తిరుగు చున్నానని, ఇంటి విద్యుత్తు కనెక్షన్ ఇప్పించేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె హబీబ్ భాషా మరియు వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి. నాంచారయ్య , జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

