దెందులూరు వైసీపీ నాయకునీ ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు
1 min read
స్వయంగా వెళ్లి నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
మానవత్వానికి పార్టీల భేదాలు లేవని చాటి చెప్పిన ఎమ్మెల్యే ప్రభాకర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పంగిడిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏలూరు ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు ఆదివారం అర్ధరాత్రి మృతి చెందిన దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామ వైసిపి మాజీ సర్పంచ్ యలమర్తి రేవతి భర్త యలమర్తి రామకృష్ణ పార్థివదేహానికి ఆయుష్ హాస్పిటల్ లోఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పూలమాలవేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా యలమర్తి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. పలువురు కూటమి నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.


