NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రారంభమైన పినాక ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

1 min read

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి.

సెట్కూరు సీఈవో డాక్టర్ కురుబ వేణుగోపాల్.

విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకోవచ్చు

రాయలసీమ రవికుమార్.

కోర్సు డైరెక్టర్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్

కర్నూలు, న్యూస్​ నేడు:  విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితేనే లక్ష్యం సిద్ధిస్తుందని సెట్కూరు సిఈఓ డాక్టర్ కురుబ వేణుగోపాల్ అన్నారు. ఐఆర్ఎస్ అధికారి,పినాక ప్రజా సాధికార ట్రస్ట్ వ్యవస్థాపకులు బి. యాదగిరి,అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పినాక సెంటర్ కోర్సు డైరెక్టర్,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ అద్యక్షతన నేడు పినాక కర్నూలు సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెట్కూర్ సీఈఓ డాక్టర్ కురుబ వేణుగోపాల్ మాట్లాడుతూ ఐ. ఆర్.ఎస్ ప్రస్తుత విశాఖపట్నం ఆదాయపన్ను శాఖ అధికారి బి.యాదగిరి సామాన్య కుటుంబంలో జన్మించి ఐ.ఆర్.ఎస్ అధికారి స్థాయికి ఎదిగారని ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీషు సబ్జెక్టుతో,ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించి చిత్తూరు జిల్లాలో రెండు కేంద్రాలను పినాక ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్,కమ్యూనికేషన్స్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్,జీ.కే, గ్రూప్స్ మరియు సివిల్స్ కు సంబంధించి గైడెన్స్ కోర్సులు ప్రారంభించారని అయితే అది నేడు రాయలసీమ వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలలో విజయవంతంగా నడపబడుతున్నదని కర్నూల్ నగరంలో పినాక సెంటర్ కు అమీలియో  హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ విద్యార్థిని విద్యార్థులకు మద్యాహ్న భోజనం,విద్యార్ధినిలకు హాస్టల్ వసతులు కల్పిస్తున్నారని విద్యార్థిని విద్యార్థులు వీటిని వినియోగించుకొని జీవితంలో గొప్పగా రాణించేందుకు,వారు వారి లక్ష్యాలను సాధించేందుకు పినాక శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ మరియు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ పినాక ఉచిత శిక్షణ తరగతులు పదమూడు సంవత్సరాలుగా రాయలసీమ వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని నేడు కర్నూల్ నగరంలో పినాక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని మరో మూడు రోజులపాటు అడ్మిషన్లను విద్యార్థిని విద్యార్థులు పొందవచ్చునని అందుకు తనను సెల్:-9177764147,9640969891 ద్వారా ఎవరైనా సంప్రదించవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య,కె. రామకృష్ణ,కురువ సంఘం నాయకులు ఎల్లప్ప తిరుమలేష్,బత్తిన కిరణ్ కుమార్,కె.సుంకన్న, కె. బలరాం,భరత్ కుమార్, కె. రాము, మురళీమోహన్,పినాక అధ్యాపకులు సునితా రోజ్, జోయిస్, స్వర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *