NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి  నెలలో నిర్వహించిన డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి. ఎస్.  శావలి ఖాన్  సోమవారం  విడుదల చేశారు. డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశామని తెలిపారు. విద్యార్థులు ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.ahuuk.ac.in  నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. మహబూబ్ బాషా పరీక్షల విభాగానికి చెందిన ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్స్ మహమ్మద్ ఇర్ఫాన్, డా. నబియా సుల్తానా, మరియు ఆర్ట్స్ డా. బి. వెంకటప్ప పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *