NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలకు సహాయాన్ని అందించడంలో లయన్స్ క్లబ్ ముందుంటుంది

1 min read

– లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో కంప్యూటర్ అకౌంట్స్ ట్యాలీ లో ఉచిత శిక్షణా తరగతుల ప్రచార గోడపత్రికలను నేడు నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్  200 దేశాలలో 50 వేలకు పైగా లయన్స్ క్లబ్ లతో   1.4 మిలియన్ల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అతి పెద్ద సేవా సంస్థ అని, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా  కంప్యూటర్ అకౌంట్స్ ట్యాలీ లో ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు లయన్ గోపీనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోవాలన్నారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ లయన్ త్రినాథ్ కుమార్ మాట్లాడుతూ యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరారు.ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లయన్ మురారి శంకరప్ప మాట్లాడుతూ సమాజసేవలో ఆత్మసంతృప్తి ఉంటుందన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలుమెల్విన్ జోన్స్  ఉపాధ్యక్షులు లయన్ కే. డి. జే బాబు మాట్లాడుతూ పేదలకు, విద్యార్థులకు తన వంతు సహాయాన్ని అందిస్తానన్నారు.లయన్ తిరుపతి సాయి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో లయన్స్ క్లబ్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించడంలో ముందుంటున్నామన్నారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజసేవ భావాన్ని అలవర్చుకోవాలన్నారు.అనంతరం లయన్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ మరియు ప్రశంసపత్రాలను లయన్ త్రినాథ్ కుమార్, లయన్ మురారి శంకరప్ప, లయన్ తిరుపతిసాయి, లయన్ కె. డి. జె బాబు లకు అందజేశారు.కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో ఓరీ, నైస్ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యదర్శి లయన్ రాయపాటి నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ మెంబర్షిప్   డ్రైవ్ లో భాగంగా  లయన్స్ క్లబ్ ద్వారా  సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆసక్తి కలవారు 9396861308 నుంబరును సంప్రదించవచ్చుని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *