ప్యారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు సోమవారం నాడు కర్నూల్ జిల్లా న్యాయ సేవ సదన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో ప్యారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, విధివిధానాలు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 ప్రకారం ప్యారా లీగల్ వాలెంటీర్స్ పనిచేస్తారని తెలిపారు. ప్యారా లీగల్ వాలంటీర్స్ ప్రవర్తన నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలు కాపాడాలని తెలిపారు. ప్యారా లీగల్ వాలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు మరియు న్యాయ సేవ సంస్థలకు మధ్య వారిదిగా వ్యవహరించాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ 2009 పథకం ప్రకారం బలహీన వర్గాలకు న్యాయసహాయ మందేలా చూడడంలో కీలకపాత్ర పోషించాలని తెలిపారు.న్యాయ చైతన్యం కల్పించడం- ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ మరియు బలహీన వర్గాలకు వారికి ప్రాథమిక హక్కులను, చట్టపరమైన హక్కులను మరియు బాధ్యతలను గురించి తెలియజేయాలని తెలిపారు. న్యాయ సహాయం మరియు మార్గదర్శకత్వం – సాధారణ ప్రజలు మరియు తాలూకా మరియు జిల్లా న్యాయ సంస్థల మధ్య వారిదిగా పని చేయాలని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నవారికి ప్రాథమిక సలహాలు ఇవ్వడం కౌన్సిలింగ్ చేయడము ఎవరైనా న్యాయ సహాయం కోసం అభ్యర్థిస్తే అధికార సంస్థ కార్యాలయానికి వారిని తీసుకెళ్లడం మరియు దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడాలని తెలిపారు. అనంతరం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు మాట్లాడుతూ ప్యారా లీగల్ వాలంటీర్స్ పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవడంలో ప్రజలకు అవగాహన కల్పించడం మరియు ప్రోత్సహించడము చిన్నచిన్న వివాదాలు అనగా భూమి వివాదాలు కుటుంబ వివాదాలు స్థానిక స్థాయిలో న్యాయస్థానానికి వెళ్లకుండానే సామరస్యకంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ఆగస్టు 21,22,23 వ తేదీలలో జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్ గురించి ప్రజలకు వివరించి వారి కేసులను సామారస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవిద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు మొదలగువారు ప్యార లీగల్ వాలంటీర్లు గా న్యాయ సేవ అధికార సంస్థలో పనిచేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

