మహిళాభివృద్ధి .. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు
1 min read
స్వయం సహాయక సంఘ సభ్యులకు,విలేజ్ ఆర్గనైజర్స్ కు అవగాహన సదస్సు
డిఆర్ డిఎ పిడి ఎ.విజయలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమం
స్థానిక డిఆర్ డిఎ హాల్లో ట్రైనింగ్ మహిళలు,బాలలకోరకు అమలు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీలక్ష్మి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం కిషోర వికాసం కార్యక్రమాలు జిల్లా లో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా స్థానిక డి ఆర్ డి ఎ ట్రైనింగ్ హాల్ లో మహిళలు మరియు బాలల కొరకు అమలు జరుపుచున్న చట్టాలు వాటి అమలు విధానం పై స్వయం సహాయక సంఘ సభ్యులకు , విలేజ్ ఆర్గనైజర్స్ కు అవగాహన సదస్సు ను పి డి , డి ఆర్ డి ఎ.విజయలక్ష్మి అధ్యక్షత న నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ. శ్రీలక్ష్మీ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. జెండర్ పై అవగాహన కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కిషోర బాలికల కొరకు బాలుర్ల కొరకు వారు అభివృద్ధి కొరకు జీవన నైపుణ్యాలను పెంపొందించుట కొరకు అమలు జరుపుతున్నా కార్యక్రమాలు ,పోక్సో చట్టం గురించి , బాల్య వివాహ నిషేధ చట్టం గురించి , జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ గురించి , యుక్త వయసు బాలురులో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి, మత్తు పదార్థాలు కు బానిసలు కాకుండా విమోచన పొందే విధానాల గురించి మరియు మహిళలు మరియు బాలల కొరకు అమల్లో ఉన్న మరిన్ని చట్టాల గురించి వివరించడమైనది.దీనిలో భాగంగా ఈరోజు ది.19.05.2026 న స్థానిక డి ఆర్ డి ఎ ట్రైనింగ్ హాల్ లో మహిళలు మరియు బాలల కొరకు అమలు జరుపుచున్న చట్టాలు వాటి అమలు విధానం పై స్వయం సహాయక సంఘ సభ్యులకు , విలేజ్ ఆర్గనైజర్స్ కు అవగాహన సదస్సు ను పి డి , డి ఆర్ డి ఎ.విజయలక్ష్మి అధ్యక్షత న నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీమతి. శ్రీ లక్ష్మీ ముఖ్యఅతిథిగా విచ్చేసినారు జెండర్ పై అవగాహన కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కిషోర బాలికల కొరకు బాలుర్ల కొరకు వారు అభివృద్ధి కొరకు జీవన నైపుణ్యాలను పెంపొందించుట కొరకు అమలు జరుపుతున్నా కార్యక్రమాలు ,పోక్సో చట్టం గురించి , బాల్య వివాహ నిషేధ చట్టం గురించి , జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ గురించి , యుక్త వయసు బాలురులో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి, మత్తు పదార్థాలు కు బానిసలు కాకుండా విమోచన పొందే విధానాల గురించి మరియు మహిళలు మరియు బాలల కొరకు అమల్లో ఉన్న మరిన్ని చట్టాల గురించి వివరించడమైనది. ప్రత్యేకించి కిషోర వికాసం వేసవి శిక్షణ శిబిరంలో యువత జీవితంలో మంచిగా స్థిరపడటానికి ఏ కారణం చేతైనా ఏదైనా అడ్డంకులు ఏర్పడితే వాటిని అధిగమించడానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని వారి అభివృద్ధి చెందిన తర్వాత వారి కుటుంబానికి గ్రామానికి మండలానికి అదేవిధంగా జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి శ్రీలక్ష్మి, పిడి – డిఆర్డిఏ శ్రీమతి విజయలక్ష్మి ,పిడి ఐసిడిఎస్ శ్రీమతి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్ర వేణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పుచ్చల వెంకటేశ్వరరావు, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నాగమణి,డిఆర్డిఏ ఏపీడి శ్రీమతి అనిత, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ లు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

