NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

33,762 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు పంపిణీకి ప్రణాళిక సిద్ధం

1 min read

ఎం ఆర్ పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్ర యిస్తే లైసెన్స్ లు రద్దు

జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా హెచ్చరిక

నియం త్రణ చట్టం 1985, ప్రకారం వారిపై కఠిన చర్యలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ – 2026 సీజనుకు 33,762 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా చెప్పారు. ఏప్రిల్, 1వ తేదీ నాటికి 11834.232 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభనిల్వలు కాగా ఇప్పటికే 3318.21 మెట్రిక్ టన్నుల యూరియా ను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం 12,607 మెట్రిక్ టన్నుల యూరియాను కో ఆపరేటివ్ సొసైటీలలో, మార్క్ ఫెడ్ గోదాములలో, రిట్రెల్/హెూల్ సేల్, మరియు కంపెనీ గోదాములలో ఎరువును రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు .రాష్ట్రం లో ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల కొరత లేదు. దేశీయంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేయుచున్నాయని,అలాగే విదేశాలనుండి కూడా అవసరమైన యూరియా దిగుమతులు సంతృప్తి కరంగా ఉన్నాయని,  రాబోయే కూడా యూరియా కు ఎటువంటి కొరత లేదన్నారు. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి ఏలూరు, సహాయ వ్యవసాయ సంచాలకులు కెఆర్ పురం, మండల వ్యవసాయ అధికారి కుక్కునూరు, రమేష్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పెదరావి గూడెం గ్రామం నందు కుక్కునూరు మండలంలో యూకలిప్టస్ నర్సరీలు, రైతుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, ఇతర పత్రాలను తనిఖీ చేసి ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించినందున డీలర్ లైసెన్స్ ను సస్పెండ్ చేశామన్నారు. రైతులందరినీ అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని సూచించమన్నారు. . వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్కే ఇన్చార్జిలతో డిపార్ట్మెంటల్ స్కీమ్స్ మీద సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు కుక్కునూరు, వేలేర్పాడు, హాజరయ్యారని,    ఖరీఫ్- 2026 సీజన్ మొదలైన నాటినుండి ఇప్పటివరకు జిల్లాలో ఈ క్రింద తెలిపిన విధంగా ఎరువుల దుకాణాలపై చర్యలు తీసుకున్నమన్నారు. తనిఖీ చేసిన ఎరువులు దుకాణాలు 58, ఎరువుల దుకాణాలకు షోకాస్ నోటీసులు జారీ 25, ఎరువులు దుకాణాల లైసెన్స్ ను సస్ఫెన్షన్ 05, ఎరువుల సీజ్ మెట్రిక్ టన్నుల్లో 48.25 MTs,నిర్బంధించిన ఎరువులు విలువ42.65 లక్షల రూపాయలు. నూతనంగా రూపొందించిబడిన సాంకేతికంగా అభివృధి పరచిన నానో యూరియా, నానో డి.ఎ.పి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగినదని,  ఇవి సాంప్రదాయ ఎరువులకు నూరు శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సాహిస్తున్నాయన్నారు. కావున, రైతు సోదరులకు తెలియచేయడం ఏమనగా, ఎరువులను కొనుగోలు చేయునప్పుడు బస్తా పై ముద్రించిన ఎం. ఆర్. పి ధరలను చూసుకుని, దాని ప్రకారము పైకము చెల్లించాలన్నారు.తప్పని సరిగా డీలరు నుండి రసీదు పొందాలన్నారు. ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా. ఎరువులను మళ్లింపు చేసిన, ఎం ఆర్ పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్ర యించిన ఎడల, వారి యొక్క లైసెన్స్ లు రద్దు చేసి, ఎరువుల నియం త్రణ చట్టం 1985, ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *