ఆటోడ్రైవర్ కుటుంబాన్ని ఆదుకున్న బీఎస్పీ
1 min read
కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించిన బహుజన్ సమాజ్ పార్టీ BSP అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు
అమలాపురం , న్యూస్ నేడు : ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామ పంచాయతీకి చెందిన పోతుల సత్యనారాయణ( ఆటో డ్రైవర్ ) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుల యధావిధిగా తన వృత్తిరీత్యా పనికి వెళ్లిపోగా ఇంట్లో కరెంటు సర్క్యూట్ అయ్యి ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు పిల్లల బట్టలు పూర్తిగా కాలిపోయి నిలువ నీడ లేక నిరాశ్రయులైనారు. ఇది తెలుసుకున్న బీఎస్పీ నేత పొలమురి మోహన్ బాబు సంఘటన స్థలాన్ని సందర్శించి కుటుంబానికి ఓదార్పు, సానుభూతి తెలియజేస్తూ… దాతలు ఎవరైనా మానవతా దృక్పథంతో ఆటోడ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. కలిసిన వారిలో గ్రామ రైతు చింతపల్లి రాంబాబు మన్నె వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.


