ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు…
1 min read
డా.సుధాకర్‌ను వేధించిన వైకాపా పాలన దళిత సమాజంపై జరిగిన దారుణానికి నిదర్శనం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి
పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి బీజేఆర్ నగర్‌లో డా.సుధాకర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా డా.సుధాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్ ఆధ్వర్యంలో బోడె ప్రసాద్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుమూర్తి మాట్లాడుతూ… గత వైకాపా ప్రభుత్వ పాలనలో దళితులు, బీసీలు,మైనార్టీలు మరియు బడుగు బలహీన వర్గాలు తీవ్ర అన్యాయాలకు గురయ్యాయని విమర్శించారు.ప్రజల తరఫున ప్రశ్నించిన వారిని అణగదొక్కడం,బెదిరించడం,వేధించడం వైకాపా పాలనలో సాధారణమైందని అన్నారు.కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి సరైన రక్షణ పరికరాలు,మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసిన డా.సుధాకర్ ని లక్ష్యంగా చేసుకుని వైకాపా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై అవమానకరంగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు..ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే నిరంకుశ పాలనకు ముగింపు పలుకుతూ,ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని గురుమూర్తి తెలిపారు,డా.సుధాకర్ సేవలను స్మరించుకుంటూ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనుమోలు ప్రభాకర్ మరియు కూటమి నాయకులను ప్రత్యేకంగా అభినందించారు… ఈ కార్యక్రమంలో పీత గోపీచంద్ యార్లగడ్డ సుచిత్ర కోయ ఆనందప్రసాద్ వేమూరి ప్రసాదు భూక్య సౌజన్య బొంగరాల అబ్రహం ముక్కామల విగ్నేశ్వర చౌదరి పాల్గొన్నారు.

