NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బక్రీద్ సందర్భంగా టిడిపి నాయకులకు ఘన సన్మానం

1 min read

బక్రీద్ పర్వదినాన టిడిపి నాయకులకు గజ్జహళ్లి మైనారిటీ యువనాయకుల సత్కారం

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన ఈబీజీ గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్

శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలవాలి : టిడిపి నాయకులు

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం గజ్జహళ్లి గ్రామంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మైనారిటీ యువనాయకులు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ ను పూలహారం, శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా టిడిపి యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ కు, టిడిపి మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మొయిన్ కు కూడా శాలువాలు, పూలహారాలతో ఘన సత్కారం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్, టిడిపి యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ ముస్లిం సోదరులకు “ఈద్ ముబారక్” శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు, ఆనందాలకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గజ్జహళ్లి గ్రామానికి చెందిన ముల్లా ఆలం, బాషా, శేక్షవాలి, ఖాదర్, హుస్సేన్, షాషు, శశావలీ యువనాయకులు, మైనారిటీ నాయకులు, టిడిపి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *