NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 (సర్ )-2026   గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి  

ఈ నెల 24వ తేదీ వరకు బిఏల్ఓ ల ద్వారా ఇంటింటికీ సందర్శిన

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )-2026   గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  ఈ నెల 24వ తేదీ వరకు BLOల ద్వారా ఇంటింటికీ సందర్శిస్తారని, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు సమర్పిస్తారన్నారు.  ఈనెల 31 వతేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించడం జరుగుతుందని, ఈనెల 31వ తేదీ నుండి ఆగష్టు, 30వ తేదీ వరకు క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారని, సెప్టెంబర్ 28 వతేదీలోగా నోటీసులు జారీ, అభ్యంతరాలను పరిష్కరిస్తారని, తుది జాబితా అక్టోబర్, 3వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా ప్రతి బూత్ లెవెల్ అధికారి, తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంను ఓటర్లకు అందచేయ్యుట, డిజిటైజేషన్  మొదలైన కార్యక్రమాలు ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.   జిల్లాలోని సమస్త ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు ప్రజలు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

About Author