ప్రత్తిపాడు నియోజకవర్గంలో అట్టహాసంగా మహానాడు వేడుకలు
1 min read
పత్తిపాడు, న్యూస్ నేడు: సరికొత్త సాంకేతికతతో, సరిహద్దులు లేని డిజిటల్ విధానంలో రెండవరోజు ప్రారంభమైన మన తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ ‘మహానాడు’ వేడుకల్లో భాగంగా క్లస్టర్ 7,ప్రత్తిపాడు మండలం, గొట్టిపాడు గ్రామంలో జరుగుతున్న రెండవరోజు హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు . మరియు నియోజకవర్గ అబ్జర్వర్ రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారుఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు మహానాడు వేడుక ఘనంగా జరుపుకోవడం మీ అందరి మధ్య మీ క్లస్టర్ లో జరుపుకోవాడము చాలా సంతోషంగా ఉందని అన్నారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కు కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచించి గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ బలోపేతం ఏవిధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారుఈసారి ‘ద్వైపాక్షిక సంభాషణల విధానం’ ద్వారా అధినాయకత్వంతో నేరుగా అనుసంధానమై, క్లస్టర్లలోని భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మన కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా మమేకమవుతున్న తీరు అద్భుతంమని,ఈ ఏడాది ‘స్త్రీ శక్తి’ ప్రధానాంశంగా మహిళా సాధికారతపై జరుగుతున్న చర్చలతో పాటు.. ‘కార్యకర్తే అధినేత’ 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ వంటి కీలక విషయాలపై మన శ్రేణులు జరుపుతున్న చర్చలు అభినందనీయం.ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేసిన సేవలను గుర్తిస్తూ ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే . తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి తుదిశ్వాస విడిచిన కార్యకర్తలందరికీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కార్యకర్తలు,అభిమానులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

