ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త
1 min read
కృషి చేయాలి – వైకుంఠం జ్యోతి
ఆస్పరిలో డిజిటల్ మహానాడుకు భారీగా తరలివచ్చిన పసుపు సైన్యం
చంద్రబాబు – లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
వైకుంఠం జ్యోతి దంపతులకు ఆస్పరి టీడీపీ నాయకుల ఘన స్వాగతం
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు
ఆలూరు న్యూస్ నేడు: ఎన్టీఆర్ ఆశయాలను సాధిద్దాం అని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. ఆస్పరి మండల కేంద్రంలో రెండవ రోజు నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో ఆస్పరి మండలం పసుపుమయంగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి మరియు ఆలూరు అబ్జర్వర్ ఆదినారాయణ లకు ఆస్పరి మండల టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చుతూ, నినాదాలతో నాయకులను ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత లోకేష్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, యుగపురుషుడు, నటసార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేశ్వరులు, మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్, మాజీ మండల కన్వీనర్లు ఎస్. తిమ్మన్న, శ్రీనివాస్ గౌడ్, మండల కార్యదర్శి శేషాద్రి నాయుడు, చిన్నహోతూరు వరదరాజులు, సాలీ సాహెబ్, సొసైటీ చైర్మన్ రత్నమ్మ, మండల గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు రంగవేణి, సొసైటీ డైరెక్టర్ సంజన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరేష్, బూత్ కన్వీనర్ ఎస్. మహేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్ సుదర్శన యాదవ్, ముత్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే బినిగేరి నారాయణ, గోపాల్, అలిగార లక్ష్మన్న, రామాంజి, అక్బర్, చిగిలి రామదాస్, చిరుమందొడ్డి సోమలింగప్ప, జోహరాపురం ఉచ్చిరప్ప, యువ నాయకులు, యూత్ కన్వీనర్ రఘు యాదవ్, రాజకుమార్, మేకల రంగనాథ్ యాదవ్, పోలీస్ హంపయ్య, తెవుల గోపాల్, నవీన్, నరసప్ప, చాప మహానంది, కట్టెల ప్రకాశ్, హంపయ్య, శంకరబండ నాగేంద్రతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


