NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముత్తుకూరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

1 min read

రైతుల భూ హక్కుల పరిరక్షణకు పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకం

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి  వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు ఆస్పరి మండలంలోని ముత్తుకూరు, వలగొండ, పుట్టకలమర్రి గ్రామాల రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆస్పరి మండల సింగిల్ విండో డైరెక్టర్ శ్రీ ముత్తుకూరు మల్లికార్జున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల భూ హక్కుల రక్షణకు, భూమి సంబంధిత వివరాల ధృవీకరణకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంఆర్ఓ మల్లికార్జున రెడ్డి , డిప్యూటీ తహసీల్దార్ భీమేష్ , ఆర్‌ఐ రంగస్వామి , వీఆర్వో సుధాకర్ , హరి నాయక్ , మండల సర్వేయర్లు పాల్గొని రైతులకు అవసరమైన సూచనలు అందించారుఅలాగే బూత్ కన్వీనర్ వీరనాయుడు, ఉప్పర మద్దిలేటి, బూత్ కాలేజీ కన్వీనర్ లాలు స్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముత్తుకూరు, పుట్టకలమర్రి, వలగొండ గ్రామాల రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతుల భూములపై పూర్తి హక్కులను కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు తమ భూ రికార్డులను సక్రమంగా సంరక్షించుకోవాలని సూచించారు.

About Author