NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మారెమ్మ దేవి దేవర మహోత్సవంలో పాల్గొన్న  ఎమ్మెల్యే

1 min read

బెల్డోన గ్రామంలో ఘనంగా జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు

ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే

ఆలూరున్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలోని బెల్డోన గ్రామంలో ఘనంగా నిర్వహించిన మారెమ్మ దేవి దేవర మహోత్సవానికి ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కుందనకుర్తి గ్రామానికి చెందిన మీనుగ మోహన్, మీనుగ బసప్పల ఆహ్వానం మేరకు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి మారెమ్మ దేవి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిప్పగిరి పెద్ద పెద్దయ్య, కుందనకుర్తి తయ్యన్న, డేగులపాడు మంజు, చిప్పగిరి వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *