NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలి…ఆర్​యూ..వీసీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. రాయలసీమ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026ని వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య వెంకట బసవరావు “ప్రకృతి స్ఫూర్తితో – వాతావరణ పరిరక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం” అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడంద్వారా భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు మొక్కలు నాటడంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పుచ్చా వెంకట సుందరానంద్,  ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డా. బి. కవిత, ప్రోగ్రామ్ ఆఫీసర్లు బి. వి. శివ ప్రసాద్ రెడ్డి, డా. ఎస్. నాగ చంద్రుడు, డా. బి. విజయుడు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *