పదోన్నతి పొందిన సిహెచ్ సీ డాక్టర్ తిరుపతి
1 min read
డాక్టర్ తిరుపతి,డాక్టర్ శారద’లకు ఘన సత్కారం..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(సిహెచ్ సీ)సూపరింటెండెంట్ డాక్టర్ కె.తిరుపతి పదోన్నతి పొందారు.శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో డాక్టర్ సాయి సుధా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.డాక్టర్ తిరుపతి అనంతపురం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శారద ఊపిరితిత్తుల విభాగం నందు ఉన్నత చదువుల కోసం వెళ్లారు.ఇద్దరు డాక్టర్లకు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ తిరుపతి ఇక్కడ నాలుగు 4 సంవత్సరాల పాటు ప్రజలకు వైద్య సేవలు అందించారు.ఉద్యోగులకు బదిలీ,పదోన్నతి,పదవీ విరమణ అనేది సర్వసాధారణమని అంతేకాకుండా ఇద్దరు డాక్టర్లు కూడా ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని డాక్టర్ల సేవలను డాక్టర్లు మరియు సిబ్బంది కొనియాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, డాక్టర్ అశ్విన్,డాక్టర్ మీనా మరియు సిబ్బంది పాల్గొన్నారు.


