NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. మంత్రి టీజీ భరత్ గుప్తా

1 min read

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  మొక్కలు నాటిన మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. స్వచ్ఛమైన గాలి ప్రతి ఒక్కరికి అవసరం అన్నారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పకుండా చేయాలని ఆయన సూచించారు.

About Author