స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) ప్రక్రియను మరింత వేగవంతం చేయలి
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం వట్లూరు లోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్), రెవిన్యూ సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలనీ, నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారములను ప్రతీ కుటుంబానికి అందించి వివరాలను సేకరించాలన్నారు. ప్రజల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారములలోని వివరాలను సంబంధిత బి.ఎల్.ఓ. లు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. గ్రామంలో ప్రజలకు అందిస్తున్న రెవిన్యూ సేవలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ జ్యోతి, ఎంపిడిఓ ఆమిల్ జమ్మద్, ప్రభృతులు పాల్గొన్నారు.

