NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్’కార్యక్రమాన్ని పరిశీలించిన డిప్యూటీ తహసిల్దార్

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో జరుగుతున్న   ‘సర్'(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమంలో భాగంగా బుధవారం మిడుతూరు డిప్యూటీ తహసిల్దార్ మరియు సర్ కార్యక్రమం సూపర్వైజర్ శాన్వాజ్ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు.ఈ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా ఫారాలను పూర్తి చేయాలని అదేవిధంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ఫారాలను పూర్తి చేయాలని బూత్ లెవెల్ అధికారి(బిఎల్వో) ఎం.శిరీషా రాణిని డిప్యూటీ తహసిల్దార్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సహాయకులు జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author