ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న అవయవదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవయవదానం ప్రాముఖ్యత, అవయవ మార్పిడి అవసరం, దాతల గొప్పతనం మరియు అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న అనేక మంది రోగులకు దాతలు అందించే అవయవాలు కొత్త జీవితానికి ఆశగా నిలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉన్న రోగులకు కిడ్నీ మార్పిడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయమైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కార్యక్రమంలో 10 మంది అవయవదాతలు పాల్గొన్నారు.అవయవదానంపై ప్రజలు సరైన సమాచారాన్ని తెలుసుకుని, తమ కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయంపై చర్చించాలి” అని అన్నారు.ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ మాట్లాడుతూ, “కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉన్న అనేక మంది రోగులు కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు.ఈ కార్యక్రమానికి 10 మంది దాతలు హాజరై తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం. వారితో కలిసి కేక్ కటింగ్ నిర్వహించడం ద్వారా ఈ రోజును మరింత ప్రత్యేకంగా జరుపుకున్నాం. వారి సేవాభావాన్ని గౌరవిస్తూ సత్కరించడం మాకు గర్వకారణం. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తుంది. ప్రజలు అవయవదానంపై ఉన్న అపోహలను వీడి, సరైన సమాచారాన్ని తెలుసుకుని ముందుకు రావాలి” అని తెలిపారు.


