NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్లాస్టిక్ నిర్మూలన… పర్యావరణ పరిరక్షణపై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయము భవనమునందు సహకార వారోత్సవాల సందర్భంగా నైస్ స్వచ్చంద సేవా అధ్యక్షులు మరియు అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరు వారిచే ప్లాస్టిక్ నిర్మూలన మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి మరియు మూగజీవాలకు కలిగే దుష్ప్రభావాల గురించి బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేసి, వాటి స్థానంలో బట్ట సంచులు మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని బ్యాంకు సిబ్బందికి తెలియజేసినారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మరియు సిబ్బంది పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వరిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.   ఈ కార్యక్రమమునకు బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి (ఇంచార్జి) శ్రీ సి. హెచ్. ఆర్.సి.ఎస్. బాలాజీ రావు , కర్నూలు, బ్యాంకు జనరల్ మేనేజరు శ్రీ పి. రామాంజనేయులు, డి.జి.యం.లు శ్రీ కె. ఉమామహేశ్వర రెడ్డి  శ్రీ , శ్రీ బి. సునీల్ కుమార్  మరియు అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీ టి. రామకృష్ణ, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్, నేషనల్ హ్యూమన్ట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 117 గవర్నర్, నైస్ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పవన్ కుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About Author