ఎఫ్ ఎల్ ఎన్ , జ్ఞాన జ్యోతి, శిక్షణా తరగతులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జ్ఞానజ్యోతి 120 రోజుల కోర్స్ శిక్షణా తరగతులలో భాగంగా ఉపాధ్యాయుల నుంచి ఎన్నిక కాబడిన డిఆర్పి లకు, మరియు అంగనవాడి సూపర్వైజర్లకు శిక్షణను నిర్వహించడం జరిగినది. మొదటి రోజు శిక్షణలో భాగంగా అందరూ హాజరై భాగస్వాములు అయ్యి, శిక్షణ పొందడం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఐసిడిఎస్ పిడి విజయ మాట్లాడుతూ పార్టిసిపెంట్స్ ( శిక్షణార్థులు) అందరూ పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకొని తథనంతరం అంగనవాడి టీచర్లకు మండల స్థాయిలో శిక్షణ ఇవ్వవలసినదిగా కోరారు.శిక్షణ కోఆర్డినేటర్ గా వ్యవహరించిన కర్నూలు అర్బన్ ఎంఈఓ 1 నాగచౌడయ్య మాట్లాడుతూ కార్యక్రమంను ప్రతి డి ఆర్ పి సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి) శిక్షణ అనంతరం అంగనవాడి విద్యాలయాల్లో బాలలను వైక్తిక భేదాలకు అనుగుణంగా, జెండర్ బేధం లేకుండా నిర్మూలించి, మెరుగుగా తీర్చిదిద్దాలని పునాది బాగుంటే పిల్లలు మంచి ప్రయోజకులవుతారని ఈ పునాదిని వేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు, ఈ కార్యక్రమానికి ఏ ఎం ఓ రఫీక్ , పలువురు ఉపాధ్యాయులు టిఆర్పీలుగాను, సిడిపివోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొనడం జరిగింది.



