NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన  ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా విశ్వ హిందు పరిషత్ సేవా విభాగం మరియు ప్రభుత్వ రాష్ట కాన్సర్ ఆసుపత్రి సంయుక్త  ఆధ్వర్యంలో నిరుపేద బి.సి‌., యస్‌.సీ. లు ఇంకా ఇతర వెనుకబడిన వర్గాలు   అధికంగా నివశించే “హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయ కళ్యాణమండపం” నందు మహిళలకు మాత్రమే గర్భాశయ ముఖద్వారం (వెజైనల్), రొమ్ము (బ్రెస్ట్), (మౌత్) నోరు, (త్రోట్)గొంతు వంటి విభాగాలకు  ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు…సామాన్యమైన రోగాలకే టెస్ట్ ల పేరుతో విపరీతంగా ధనం ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో నూటికి 20 శాతం మందిని అందులో ధనికులను మాత్రమే ఇబ్బంది పెట్టే ఈ క్యాన్సర్ మహమ్మారి మారిన సామాజిక పరిస్థితులు, చెడు ఆహారపు అలవాట్లు, వ్యసనాలు, నిలువ రసాయనాలు కలిపిన ప్యాకేజీ ఆహారాలు వాడటం, ఇస్టంట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ల పేరుతో‌‌.‌.‌…అధిక కొలెస్ట్రాల్ కలిగించే పిజ్జాలు,బర్గర్లు వంటివి తినడం వల్లనే సామాన్యులను, నిరుపేదలను కూడా ఈ క్యాన్సర్ మహామ్మారి కబళిస్తుండటం, శోచనీయం…దాదాపు 40% మంది ప్రజలు ఈ వ్యాధికి గురి అవ్వడం అత్యంత ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుందని……విశ్వ హిందు పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి ఆందోళన వ్యక్తం చేశారు, విశ్వ హిందూ పరిషత్  రాష్ట్ర సేవా కన్వీనర్ డా.రామ్మూర్తి మాట్లాడుతూ… విశ్వ హిందు పరిషత్ దేశ వ్యాప్తంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా హీ పరమోధర్మః అన్న ధర్మసిధ్ధాంతం ప్రకారం హిందూ మహిళలకు, పిల్లలకు,యువతులకు  విద్య, వైద్యం, ఉపాధి, వంటి విషయాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,  కర్నూలు నగరంలో గౌరవనీయులైన ప్రముఖ మిఠాయి వ్యాపారస్తులైన దివంగత శ్రీ జీ. పుల్లారెడ్డి గారు 1975 సం.లో స్థాపించిన విజ్ఞాన పీఠం,(బాలుర అరక్షిత శిశుమందిరం) గుంతకల్లు లోని విశ్వ హిందు పరిషత్ బహుళార్దక సాధక కేంద్రము, తాడిపత్రి లోని సౌభాగ్యసింధు బాలుర, బాలికల “అరక్షిత శిశు మందిరాలు” నిర్వహిస్తున్నామని, అలాగే కర్నూలు రెవెన్యూ కాలనీ లోని విశ్వ హిందు పరిషత్  కార్యాలయం ప్రాంగణంలో ఉచిత కుట్టు శిక్షణా, మగ్గం వర్క్, బ్యూటీపార్లర్, మెహెందీ వంటి వాటిలో మహిళలకు, యువతులకు శిక్షణ ఉచితంగా ఇస్తున్నామని దీనిని హిందూ మహిళలు,యువతులు అందుకుని, నేర్చుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని , తద్వారా మహిళా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అన్నిరకాల ఉచిత వైద్య శిబిరాలు ప్రతి సం నిర్వహిస్తామని తెలియజేశారు.రాష్ట్ర  క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డా‌ సి.ఎస్.కే‌ ప్రసాద్ మాట్లాడుతూ  మొట్టమొదటి సారిగా విశ్వ హిందు పరిషత్ వారి సహకారంతో అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే అవకాశం, తమకు రావడం అత్యంత సంతోషకరమని అన్నారు 5 మంది ప్రముఖ (అంకాలజిస్ట్) క్యాన్సర్ వైద్యనిపుణులు ఇక్కడకు విచ్చేసిన సుమారు 100 మంది మాతృమూర్తులకు,యువతులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని సహకరించిన విశ్వ హిందు పరిషత్, మరియు ఆలయం కమిటి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఆలయకమిటీ అధ్యక్షులు ఉదయ ప్రసాద్ మాట్లాడుతూ…. ప్రభుత్వ రాష్ట కాన్సర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో, విశ్వ హిందు పరిషత్ కర్నూలు జిల్లా వారి ఆధ్వర్యంలో బి.సి.లు, యస్సీలు , వెనుకబడిన కులాల వారు, రెక్కాడితే గానీ  డొక్కాడని వారు నివశించే మా హరిశ్చంద్ర శరీన్ నగర్ లో అత్యంత ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించిన ప్రభుత్వ స్టేట్ క్యాన్సర్ వైద్యనిపుణులకు, విశ్వ హిందు పరిషత్ కర్నూలు జిల్లా కార్యకర్తలకు పేరు, పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ సేవా కన్వీనర్లు గురుమూర్తి, అనంత విశ్వ ప్రసాద్ , రాష్ట్ర మాతృ శక్తి కన్వీనర్ గౌరి, ప్రచార – ప్రసార కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్, మాతృ శక్తి విభాగ్ కన్వీనర్ మాళిగి పావని, స్కీనింగ్ నిర్వహించిన వైద్యులు డా.వెంకట సుబ్బ నాగరాజు, డా.కే.శివప్రసాద్, డా.వంశీకృష్ణ,డా.వర్షిణి, డా. హిమజ,డా.యం.సురేఖ,డా‌.యల్. శ్రీలక్ష్మి, నర్సింగ్ సుపరింటెండ్ అనసూయమ్మ,  విశ్వ హిందు పరిషత్ జిల్లా కార్యకారిణి జిల్లా సహ సేవాప్రముఖ్ సల్కాపురం బాబూరావు,  ఉపాధ్యక్షులు గోవింద రాజులు,కార్యదర్శి ఈ పూరి నాగరాజు, జిల్లాసహకార్యదర్శులు గూడురు గిరిబాబు, కరణం సుధాకర్,జంపాల నవీన్, సంగు రామ్ బాబు, కోశాధికారి తుంగా రమేష్, ప్రచార – ప్రసార ప్రముఖ్ ఉపేంద్ర నాయక్, బజరంగ్ దళ్ సహసంయోజక్ బళ్ళారి  తేజ,శివఛామిరాజు, గోరక్షా జే‌.పీ‌‌.సింగ్,  ధర్మాచార్య ప్రముఖ్ శివపురం మణికంఠ, ధర్మప్రసార్ సింహ ప్రముఖ్ కురుకుంట్ల సంజీవయ్య, ప్రఖంఢ దుర్గా వాహిని కార్యకర్తలు అశ్విని, సాహితి, పరిమళ, లావణ్య, హేమమాధురి, నిహారిక, హరిచందన తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *