NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహకార వారోత్సవాలు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  05.07.2026న సహకార వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని 43 ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో సహకార సే సమృద్ధి కార్యక్రమం “సెల్ఫీ టెస్టిమోనిల్” మరియు “కామన్ సర్వీస్ సెంటర్ ప్రోగ్రాం ” భాగంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులు మరియు మెంబర్లు పాల్గొని సహకార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.సహకార వారోత్సవాలలో భాగంగా మద్దికేర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు రైతులకు ప్రతి సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంటల సాగు కోసం అవసరమైన పంట రుణాలు సకాలంలో ఉపయోగపడుతున్నాయని  తెలియజేసినారు మరియు గోల్డ్ లోన్స్, వ్యాపార ఋణాలు, ఇంటి ఋణాలు ల్పించడం జరుగుతుందని తెలియజేసినారు. సంఘం నందు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పాన్ కార్డ్స్, కరెంట్ బిల్స్, టిక్కెట్స్ బూకింగ్స్, ఫసల్ భీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ , క్రాఫ్ ఇన్షూరెన్స్ మరియు ఇతర సేవలు అందిస్తు, అలాగే ప్రభుత్వ నిర్ణయించిన ధరల ప్రకారమే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ అవసరాల సామగ్రి సంఘం ద్వారా అందుబాటులోకి వస్తున్నాయని తెలియజేసినారు. ముఖ్యంగా, తక్కువ వడ్డీ రేటుతో పంట రుణాలు సకాలంలో అందడంవల్ల వ్యవసాయ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ర్వహించగలుగుతున్నాము మరియు సహకార సంఘం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం, ఎరువులు,ఇతర సేవలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలియజేసినారు .సహకార వారోత్సవాల సందర్భంగా నన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “సహకార్ సే సమృద్ధి” భాగంగా నన్నూరు  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే సహకార సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ప్రతి దశలో సహకార సంఘం అండగా నిలుస్తోందని,  తెలిపారు. సహకార సంఘాల అభివృద్ధికి రైతుల సహకారం అత్యంత అవసరమని పేర్కొంటూ, తీసుకున్న రుణాలను గడువులోపు చెల్లించడం ద్వారా సంఘం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, అదే నిధులను తిరిగి రైతులకే రుణాల రూపంలో అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. రైతులు రుణాల చెల్లింపులో బాధ్యతగా వ్యవహరించి సహకార స్ఫూర్తిని చాటాలని కోరారు. మార్గదర్శకత్వంలో సహకార సంఘం ఆర్థిక కార్యకలాపాలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తూ, రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని నన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వారు తెలిపారు.ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో , కామన్ సర్వీస్ సెంటర్ మరియు  ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా పొందుతున్న ప్రయోజనం గూర్చి  రైతులు మరియు మెంబర్స్  వీడియో రూపన  తెలియజేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *