NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చిన్నహ్యాట శేషగిరి

1 min read

జులై 14లోపు ఓటరు వివరాలు సరిచూసుకుని అవసరమైన సవరణలు పూర్తి చేసుకోవాలని పిలుపు

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని శ్రీ బాలాజీ పెట్రోల్ బంక్ ఆవరణలో ఉన్న 41వ పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రజానాయకుడు, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చిన్నహ్యాట శేషగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా దరఖాస్తు పత్రాన్ని నింపి బీఎల్‌ఓ చాణక్యకు అందజేశారు.ఈ సందర్భంగా చిన్నహ్యాట శేషగిరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రతి ఓటరు సహకరించాలని కోరారు. జులై 14 చివరి తేదీ కావడంతో ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉంటే వెంటనే సంబంధిత బీఎల్‌ఓ సహాయంతో సరిచేసుకోవాలని సూచించారు.కొత్త ఓటరు నమోదు, పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాల సవరణలు వంటి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఓటరు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సి.హెచ్. అశోక్, బీఎల్‌ఓ చాణక్య, ఐటీడీపీ నాయకుడు హనుమంతు జార్జ్, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *