NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దద్దరిల్లిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం  

1 min read

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

16 గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండాల ఆవిష్కరణ – ఉద్యమ స్ఫూర్తితో భారీ వేడుకలు

సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత ఉధృతం చేయాలని నాయకుల పిలుపు

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉద్యమ స్ఫూర్తి నిండిన వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండలంలోని దాదాపు 16 గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండాలను ఆవిష్కరించి, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు ఉద్యమం అంకితమై ఉందనే సందేశాన్ని ప్రజల్లో బలంగా చాటిచెప్పారు. గ్రామాలన్నీ ఉద్యమ నినాదాలతో మార్మోగిపోగా, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎస్. కెంచప్ప, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవప్ప, ఆలూరు నియోజకవర్గ కో-ఇన్‌చార్జి మల్లికార్జున, డివిజన్ నాయకుడు పంచగుండిగ వెంకటేష్, బహుజన టైమ్స్ ఎండీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత ఉద్యమ నాయకుడని కొనియాడారు.యువత ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని సమాజంలో వివక్ష నిర్మూలన, సమాన హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ధైర్యంగా ముందుకు రావాలని నాయకులు కోరారు. ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను బలోపేతం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్సీ జిల్లా కార్యదర్శి పక్కిరప్ప, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పల్లె ఈరన్న, చిన్నయాట మల్లి, గోవర్ధన్, శేషగిరి, గోవిందు, తిక్కన్న, లక్ష్మీకాంత్, వెంకటేష్, తప్పెట మల్లికార్జున, నగేష్, దావీదు మంగన్న, సాయిబేస్, నాగరాజు, రమేష్, మల్లయ్య, క్యాంప్ కల్లప్ప, బుడగ జంగాల మండల నాయకులు రామంజి, అంజిని, నాగప్ప, చిన్న చిట్టి, తమన్నా, రామదాసు తదితరులు పాల్గొన్నారు.అలాగే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై 16 గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండాలను ఆవిష్కరించి, ఉద్యమ నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హోళగుంద మండలంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉద్యమ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *