NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాగునీటి సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నాయకులు

1 min read

చెడిపోయిన మోటార్లను వెంటనే మరమ్మతు చేసి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని విజ్ఞప్తి

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని సులువాయి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను గ్రామ టీడీపీ నాయకులు మంగళవారం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దృష్టికి తీసుకెళ్లారు. విరుపాపురం నుంచి సులువాయి గ్రామానికి సరఫరా అవుతున్న తాగునీటి మోటారు ఇటీవల చెడిపోవడంతో గ్రామంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలతో కలిసి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు కే. భీమిలింగప్ప చౌదరి ఎంపీడీవోను కలిసి గ్రామంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. చెడిపోయిన మోటార్లను అత్యవసరంగా మరమ్మతు చేయించి తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్, మల్లికా బసవరాజ్, చాకలి గోపాల్, కుమ్మరి లక్ష్మణ, మోహన్, యాటే దేవన్న, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author