NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో  నెల వారి నేర సమీక్ష 

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి పి శ్రీదేవి తన కార్యాలయం లో కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో  నెల వారి నేర సమీక్ష  నిర్వహించారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించడంతో తిరిగి నాటు సారా తయారీ చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని,వారందరినీ బైండోవర్ చేయాలని, నాటు సారా తయారీదారులకు బెల్లం అమ్మకాలు చేస్తున్న బెల్లం వ్యాపారులపై నిఘా ఉంచి వారందరినీ బైండోవర్ చేయాలని, తిరిగి నాటుసారా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై  పిడి యాక్ట్ తయారు చేయాలని ,నాటు సారా మానివేసిన వారికి  ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు పొరుగు   రాష్ట్రాల మద్యం జిల్లాలో కి ప్రవేశించకుండా, నిరంతర నిఘా ఉంచి   దాడులు కొనసాగించాలని ఆదేశించారు. పాత కేసులలో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారుపొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో మరియు గ్రేవ్ క్రైమ్ కేసుల్లోదర్యాప్తు పూర్తి చేసి, అరెస్టు పెండింగ్ ఉన్న ముద్దాయిలను సత్వరమే అరెస్టు చేయాలని దర్యాప్తు అనంతరం  చార్జ్ షీట్ కోర్టు కు సమర్పించాలని ఆదేశించారు.  గంజాయి పెంపకం మరియు ఇతర నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా అరికట్టుటకు నిఘా ఉంచి సమాచారం సేకరించి దాడులు చేయాలని, పెండింగ్ ఉన్న గంజాయి కేసుల్లో, మ్యాజిస్ట్రేట్ చేత ఇన్వెంటరీ చేసి వాటిని నశింప చేయడానికి డ్రగ్ డిస్పోజల్ కమిటీకి ప్రపోజల్స్ పంపాలని  మరియు దర్యాప్తు పూర్తి చేసి చార్ షీట్ వేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా చూడాలని ఆదేశించారు మద్యం దుకాణాల రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను మరియు పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, గడువు తేదీ తర్వాత చెల్లించిన వారి నుండి ఫైన్ వసూలు చేయాలని, మద్యం షాపులు మరియు బార్లు తనిఖీలు చేసి శాంపుల్ లు తీయాలని ఆదేశించారు.ఈ రివ్యూ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ రావిపాటి హనుమంతరావు  కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చ సుధీర్ బాబు , మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్  రామకృష్ణారెడ్డి, కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *