ఈ నెల 18న చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం కొరకు ప్రత్యేక లోక్ అదాలత్”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ, రాష్త్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై, 18 కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్ లో ఉన్న చెక్ బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించు కోవడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా జడ్జి జి. కబర్థి తెలియజేశారు. ఈ అవకాశమును కక్షిదారులు మరియు బ్యాంక్ అధికారులు, ఫైనాన్స్ అధికారులు, న్యాయవాదులు అందరూ ఉపయోగించుకొని , తమ తమ చెక్ బౌన్స్ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.


