NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు తప్పని సరిగా పంట భీమా చేయించుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఖరీఫ్ 2026 ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున సాగు చేసిన   పత్తి, వేరుశనగ, టమోటా పంటలు  వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రైతులు పంటల బీమా ఈ నెల 15 తేదీ లోపల చేయించుకోవాలని మరియు వరి , మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదము, మిరప, కొర్ర, సజ్జలు, ఉల్లి వేసిన రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట పథకం కింద ఈ నెల జూలై  31 వ తేదీలో పంటల భీమా చేయించుకోవాలి  క్రాప్ లోనూ తీసుకున్న రైతులు బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని, నాన్లోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రతి రైతు కచ్చితంగా తప్పనిసరిగా పంటల బీమా ప్రతి రైతు రైతు సేవ కేంద్రం ద్వారా క్రాప్ సోనూ సర్టిఫికెట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేయడమయినది. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ డి. విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు పుసులూరు, బొల్లవరం గ్రామములో రైతులకు అవగాహన కల్పించడం జరిగినది.

About Author