నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి
1 min read

నంద్యాల, న్యూస్ నేడు: ఈనెల 15వ తేదీన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు రానున్న మంత్రి నారా లోకేష్ గారు పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని స్పష్టమైన హమీ ఇవ్వాలని లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని డివైఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు.ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు యువ నాయకులు టిడిపి మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ గా నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయనను కోరుతున్నామని యువగలం పాదయాత్రలో నంద్యాల జిల్లాకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలలో మరియు నంద్యాల జిల్లాలో చాలామంది ప్రజలు యువతీ యువకులు పనులు లేక వలస వెళ్లడం జరుగుతుంది దీనిలో దృష్టిలో పెట్టుకొని మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలని ఈ మధ్యకాలంలో జరిగిన సమావేశంలో కూడా ఆయన రాయలసీమ ప్రాంతాలకు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చానని ఆయన మరొకసారి గుర్తు చేసుకున్నారు. కనుక నంద్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా డివైఎఫ్ఐ గా ఈ ఈ కింది డిమాండ్లను నెరవేర్చాలని మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాం.
1.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.2.నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. 3.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 4.బనగానపల్లె, బేతంచర్ల ప్రాంతాలలో సున్నపురాయి ఆధారంగా నూతన సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.5.నంద్యాల జిల్లాలో అనేక రకాల ఖనిజ సంపద ఉంది దీనికి ఉపయోగించి ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి.6.నంద్యాల జిల్లాలో ఉన్న అడవి సంపదను ఉపయోగించుకొని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అలాగే నూతన పేపర్ మిల్లును పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.7.నంద్యాల జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.8.నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి.ఈ డిమాండ్లపై మంత్రి నారా లోకేష్ స్పందించి నంద్యాల జిల్లాకు రావాలని కోరుతున్నామని తెలిపారు. లేని పక్షాన నంద్యాల జిల్లా వ్యాప్తంగా యువతి యువకులను ప్రజలను కలుపుకొని ఆందోళన చేపడుతామని నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి మా భాష, ఉపాధ్యక్షులు సాయి,ఫయాజు, విష్ణు, ఇర్ఫాన్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


