( ఎస్ఐఆర్) ప్రక్రియను మరో 3 నెలలపాటు పొడిగించాలి
1 min read

సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య
న్యూస్ నేడు, పత్తికొండ: ఆంధ్రప్రదేశ్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర నవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓట్ల గల్లంతు, ఫారాల నింపడంలో ఇబ్బందులు, బీఎల్ వోల అలసత్వం, మరియు రాజకీయ ప్రమేయం వంటి ప్రధాన సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 14వ తేదీకీ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తవుతుందని ప్రకటించారు. గడువు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇంకా చాలా మంది ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో సర్ గడువు మూడు నెలల పాటు పొడిగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బీ. గిడ్డయ్య కోరారు. సోమవారం ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక చదువులు రామయ్య భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి యు. కారుమంచి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరో 3 నెలలపాటు పొడిగించి, అర్హులైన అందరూ ఓటు హక్కు పొందేవిధంగా నిర్దిష్ట చర్యలు చేపట్టవలసిందిగా వారు కోరారు. తదనంతరం (RDO)ఆర్ డి ఓ ఓబులేసుకు వినత పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య .తుగ్గల మండల కార్యదర్శి సుల్తాన్ .పట్టణ కార్యదర్శి రామాంజనేయులు .జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్ పెద్ద ఈరన్న నెట్టికంటయ్య .మండల సహాయ కార్యదర్శి జోల్లాపురం కాసిం. వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు .వెంకటరామిరెడ్డి. ఏ ఐ టి యు సి నాయకులు గుండు బాషా. మాదన్న .ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సిద్దలింగప్.


