ఉద్యోగులకు ప్రభుత్వం పై నమ్మకం కలిగింది
1 min read

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మన డ్యానామిక్ లీడర్ శ్రీ బొప్పారాజు వెంకటేశ్వర్లు కు అలాగే చొరవ చుపిస్తున్న ప్రభుత్వం నకు కృతగ్ఞతలు.
కర్నూలు,న్యూస్ నేడు: ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన డిమాండ్లుపై రెండు రోజులు ప్రభుత్వం చర్చలు జరపడంతో ఉద్యోగులకు ప్రభుత్వం పై నమ్మకం కలిగింది.ఉద్యోగుల ఆర్థిక,ఆర్దికేతర సమస్యలు అన్ని ఈనెలలోనే జరపబోవు ఉద్యోగసంఘాలతో సమావేశంలో గౌః ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉద్యోగులకు ఉంది.ఏపిజేఏసి అమరావతి కర్నూలు జిల్లాకమిటిగత రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పరిష్కారం కాకుండా తీవ్ర జాప్యం జరుగుతున్న నేపధ్యంలో, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం, దానికి అనుగుణంగా ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేసేందుకు అన్ని జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో, ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి ఈనెల 10,11 తేదిల్లో మంత్రులకమిటి చర్చలు జరపడాన్ని ఉద్యోగవర్గం తరుపున స్వాగతిస్తున్నామని ఏపిజేఏసి అమరావతి ఉద్యమ కార్యాచరణ వరకు వెళ్లకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి సత్వర చర్యలు తీసుకున్నందుకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గౌ:ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి జిల్లా కమిటి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపిజేఏసి అమరావతి కర్నూలు జిల్లా కమిటి చైర్మన్ శ్రీ కె.వై.కృష్ణ, సోమవారం జరిగిన సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో శ్రీమతి సహేరా బాను, చైర్‌పర్సన్ మహిళా విభాగం APJAc అమరావతి, APRSA జిల్లా అధ్యక్షుడు నాగరాజు, శ్రీ.నాగరమణయ్య, APJAC అమరావతి ,జిల్లా అసోసియేట్ చైర్మన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలుపై ఏపిజేఏసి అమరావతి 21 డిమాండ్లతో చేపట్టబోవు పోరాటాలపై ఈ నెల 10/11 తేదీల్లో రెండు రోజులుగా గౌ:ఆర్థిక, రెవెన్యూ, I &PR శాఖామాత్యులు ముగ్గురు హాజరై ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వంతో సుదీర్ఘంగా అమరావతి సచివాలయంలో చర్చించడం, ఆ చర్చల్లో ప్రధానంగా ఉద్యోగులు అందరూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిషనర్ నియామకం, IR ప్రకటన, DA ల విడుదల, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టిసి ద్వారా నిర్వహించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు తదితర ప్రధానమైన 21 డిమాండ్లను గౌ ||మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారని, మా న్యాయమైన 21 డిమాండ్లపై ప్రభుత్వం రానున్న ఉద్యోగ సంఘాల సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఈ కూటమి ప్రభుత్వం పై ప్రధానంగా గౌ:ముఖ్యమంత్రి పై నమ్మకం ఉందని తెలిపారు.
గౌ||ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ముందుకు వచ్చినందున, ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వంతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా అతి త్వరలో జరపడానికి నిర్ణయించినందున, సదరు చర్చలకు ఏపీ జేఏసీ అమరావతి సన్నద్ధం సభలు విఘాతం కలిగించకూడదు అని మా రాష్ట్రనాయకత్వం భావించి 12వ తేదీ జరగబోయే ఉద్యమ సభను తాత్కాలిక వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో జరుగబోయే సమావేశంలో అన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుని ఆశిస్తూ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ గురించి సదరు సమావేశం అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.


