NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీలో నివసిస్తున్న శ్రీనివాసులు 55 స0.లు. అనే వ్యక్తి సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ జయన్న తన సిబ్బందితో  ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తామని సిఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *