జాతీయ కళానంది పురస్కార గ్రహీతలకు రంగస్థల ఐక్యవేదిక అభినందన సభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక నిర్వహణ,,,,,,హైదరాబాద్ నగరం నందలి త్యాగరాయ గాన సభ , మన కళాక్షేత్ర ఫౌండేషన్, , ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ హైదరాబాద్ వారిజాతీయ కళానంది పురస్కారాలను, రంగస్థల పురస్కార అందుకున్న కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులను 16వ తేదీ గురువారం ఉదయము పదిన్నర గంటలకు, కర్నూలు జిల్లా కేంద్ర గ్రంథాలయం, పాత బస్టాండ్, కర్నూలు నందు అభినందన సభ మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమం, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక, అధ్యక్షులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, పి హనుమంతరావు చౌదరి, ప్రధాన కార్యదర్శి, వివి రమణాచారి, సమన్వయకర్త డాక్టర్ భైలుప్పల షఫీయులా, వివిధ రంగాలలో పురస్కారాలు అందుకున్న కళాకారులను ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించనున్నారు. ఈ అభినందన సభ కార్యక్రమానికి కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల ను,అభినందించనున్నారు,కావున కర్నూలు జిల్లా రంగస్థల, కళాకారులు రంగస్థల,ప్రేమికులు, రంగస్థల సమాజాల ప్రతినిధులు,జాతీయ, కళానంది పురస్కార గ్రహీతలకు, అభినందనలు తెలియజేయ,వలసినదిగా హృదయపూర్వక ఆహ్వానం .


