NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమావాస్య సందర్భంగా  పలు దేవాలయాలలో  ప్రత్యేక పూజలు

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం చిప్పగిరి గ్రామంలో అమావాస్య సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శ్రీ భోగలింగేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ గోవిందప్ప స్వామి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *