NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూనియర్ లెక్చరర్ ఎల్లన్నకు పదోన్నతి

1 min read

స్కూల్ అసిస్టెంట్ నుండి డిగ్రీ లెక్చరర్ దాకా..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: స్కూల్ అసిస్టెంట్ నుండి తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి డిగ్రీ లెక్చరర్  దాకా ఎదిగారు మచ్చకంటి ఎల్లన్న..ఈయన నంద్యాల జిల్లా మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా ఉన్న ఎల్లన్న డిగ్రీ లెక్చరర్ గా పదోన్నతి పొందారు.కర్నూలు ఫర్ మెన్ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.2023 లో మిడుతూరు జూనియర్ కళాశాలకు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) లెక్చరర్ గా వచ్చారు.గత సంవత్సరం నుండి ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.ఈ స్థానంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా ఇదే కళాశాలలో పనిచేస్తున్న ఏ. తిరుమలేశ్వర్ రెడ్డిని నియమించారు.ఇక్కడ మూడేళ్ల కాలంలో పనిచేసిన ఎల్లన్న కళాశాల విద్యార్థులను విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మిమిక్రీ ద్వారా విద్యార్థులను ఉత్సాహపరిచే వారనడంలో సందేహం లేదు.

ఎల్లన్న ఉద్యోగ ప్రస్థానం

స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా ఎన్నికై వెలుగోడు మండలం వేల్పనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2005 నుండి 2009 వరకు..2011 వరకు మిడుతూరు జడ్పీహెచ్ఎస్,2012 లో ఏపీపీఎస్సీ పరీక్షలు ఎంపికై గోనెగండ్ల జూనియర్ కళాశాలలో మొదటి లెక్చరర్ గా ఆరు సంవత్సరాల పాటు పని చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *