NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ గా వి.శ్రీనివాసరావు బాధ్యతలు

1 min read

ఆహ్వానించి అభినందనలు తెలియజేసిన తోటి సిబంది

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు  బదిలీపై వచ్చిన డాక్టర్ :వి శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు.బదిలీల్లో పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మదనపల్లెకు బదిలీ కాగా వారి స్థానంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం నుండి డాక్టర్ వి శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు నూతన ప్రిన్సిపల్ ని సాదరంగా  ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు.

About Author